telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీకి రానున్న 60 టన్నుల ఆక్సిజన్…

ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. దాంతో కరోనా పేషేంట్లకు వైద్యం ఇచ్చే సమయంలో అవసరమైన ఆక్సిజన్ కొరత భారీగా ఏర్పడుతుంది. ఈ విషయం పై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ కేంద్రానికి లేఖ రాసాడు. దాని పై సానుకూల స్పందించింది కేంద్రం. రాష్ట్రానికి కొత్తగా మరో మూడు ఐఎస్‌ఓ ట్యాంకులు ఇవ్వనుంది కేంద్రం. వాటిని రేపు మధ్యాహ్నం దుర్గాపూర్‌లో అప్పగించనున్న కేంద్రం… ఎల్లుండి కృష్ణపట్నం 60 టన్నుల ఆక్సిజన్‌తో చేరుకోనున్నాయి ప్రత్యేక రైలు. ఇప్పటికే దుర్గాపూర్‌ స్టీల్‌ ఫ్యాక్టరీలో 2 కొత్త ట్యాంకుల్లో ఆక్సిజన్‌ నింపిన అధికారులు… ఒక్కో ట్యాంకులో 20 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్, మొత్తంగా 60 మెట్రిక్‌ టన్నులు ఏపీకి రానుంది. ఆక్సిజన్‌ ఎక్స్‌ ప్రెస్‌ద్వారా రేపు నెల్లూరులోని కృష్ణపట్నం చేరుకోనున్నాయి ఆక్సిజన్‌ ట్యాంకులు. అయితే ఒడిశాలో వివిధ కర్మాగారాలనుంచి ఈ ఆక్సిజన్‌ను సేకరించనున్న రైళ్లు… నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రులకు రిజర్వ్‌లో ఆక్సిజన్‌ నిల్వలు ఉంచేందుకు వెసులుబాటు కల్పించింది. 

Related posts