హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో రోగి కడుపులో కత్తెరను మరిచిపోయిన ఘటనపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. బాధితురాలి బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స అందించిన వైద్యులు మాధవ్, కృష్ణమోహన్‌పై కేసు నమోదు అయ్యింది. చికిత్సలో నిర్లక్ష్యం వహించినట్లు దర్యాప్తులో వెల్లడి అయితే కఠిన చర్యలు తీసుకుంటామని పంజాగుట్ట ఏసీపీ విజయ్‌కుమార్ తెలిపారు.
మహేశ్వరి చౌదరి(33) అనే మహిళ డైయాఫ్రమెటిక్ హెర్నియా వ్యాధితో అక్టోబర్ 28న నిమ్స్ లో సర్జరీ చేశారు. ఆపరేషన్ సమయంలో వైద్యులు ఆమె కడుపులో కత్తెరను మరిచిపోయి కుట్లు వేశారు. తీవ్రమైన కడుపునొప్పిరావడంతో ఎక్స్‌రే తీయగా ఆమె కడుపులో సర్జికల్ కత్తెర ఉన్నట్లు గుర్తించారు.ఈ వ్యవహారం పై పేషెంట్ బంధువులు ఆసుపత్రిలో ఈ రోజు ఆందోళనకు దిగారు. అనంతరం పంజగుట్ట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.