telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

భార్య ఉండగా మరో అమ్మాయి వైపు చూస్తే…

Plane

గత ఆదివారం మియామి నుంచి లాస్‌ఏంజెలెస్ వెళ్లాల్సిన విమానం రన్‌వేపై ఆగి ఉంది. మియామి నుంచి లాస్‌ఏంజెలెస్ వెళ్తున్న ఈ విమానంలో మెక్‌లెమోర్ అనే యువతి, ఆమె భర్త ప్రయాణిస్తున్నారు. విమానంలో మెక్‌లెమోర్ భర్త వేరే అమ్మాయి వైపు చూడటాన్ని ఆమె గమనించింది. అంతే.. వెంటనే సీటులో నుంచి ఒక్కసారిగా లేచి తన భర్తను బూతులు తిట్టింది. ఆపడానికి ప్రయత్నించిన ఫ్లైట్ అటెండెంట్‌ను కూడా అనరాని మాటలు అనింది. అందరి ముందు అవమానిస్తావా? అంటూ భర్త తన సీటులో నుంచి బయటకు రాగా.. ల్యాప్‌టాప్‌ తీసుకుని అతన్ని వెంబడించి మరీ కొట్టింది. దీంతో మిగతా ప్రయాణికులందరూ వారివైపు ఆశ్చర్యంగా చూశారు. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. కాసేపటికే వీడియో వైరల్ అయిపోయింది. కాగా, వారిద్దరిని విమానం నుంచి కిందకు దింపేసినట్టు అధికారులు తెలిపారు. విమానంలో రచ్చ చేసినందుకు, ఫ్లైట్ అటెండెంట్‌ను తిట్టినందుకు గాను ఆమెపై కేసు నమోదు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.

Related posts