telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ఈసారి తీరప్రాంతాన్ని ఎంచుకున్న … ఉగ్రమూక ..

high alert in coastal areas on terrorists

ఉగ్రవాదులు తీరం వెంబడి భారత భూభాగంలోకి చొరబడి దాడి చేసే అవకాశాలున్నట్లు నిఘావర్గాల సమాచారం ఉందని నావికాదళ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల్లోనే కాక సముద్ర జలాల్లో పహారా బాగా పెంచామని ఆయన తెలిపారు. ఈ మేరకు ఓ జాతీయ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. రాడార్ల సాంకేతికత ద్వారా, సముద్రంలో అనుమానాస్పద నౌకల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, కీలక ప్రాంతాల్లో నౌకాదళాన్ని మోహరింపజేశామని ఆ అధికారి వెల్లడించారు.

భారత నేవీ శత్రువులను సులువుగా తెలుసుకొనేలా దేశంలో 2.5 లక్షల వరకూ ఉన్న 20 మీటర్ల కన్నా ఎత్తున్న మత్స్యకారుల పడవలన్నింటికీ ఓ ట్రాకింగ్‌ వ్యవస్థను బిగించాలని తాము ప్రభుత్వాన్ని కోరినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంపై పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్ ఖామర్ జావెద్‌ బజ్వా చేసిన వ్యాఖ్యలను అధికారులు ప్రస్తావించారు. కశ్మీర్‌ ప్రజల బాగు కోసం తాము ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నామని గతంలో ఆయన వ్యాఖ్యానించారు. జైష్‌-ఎ-మహమ్మద్‌ నాయకుడు మసూద్‌ అజర్‌కు సోదరుడైన ఉగ్రవాది రహుఫ్ అజర్‌ ఈ మధ్య పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో తిరుగుతున్నాడని నిఘా వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే.

Related posts