telugu navyamedia
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న “రణరంగం”

Ranarangam

శ‌ర్వానంద్ హీరోగా సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో “ర‌ణ‌రంగం” అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన కాజ‌ల్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆక‌ట్టుకుంది. కాకినాడ ప్రాంతంలో ఉండే చిన్న రౌడీ… మాఫియాగా మారే నేప‌థ్యంలో చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో శ‌ర్వానంద్ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌నిపించ‌నున్నాడ‌ని చెబుతున్నారు. అయితే ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానున్న విషయం విదితమే. ఇటీవల ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. ఈ సినిమాతో మంచి హిట్ ను అందుకుంటానని నమ్మకంతో ఉన్నాడు శర్వానంద్.

Related posts