telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తమిళ ఇండస్ట్రీకే గోవా బ్యూటీ ప్రాధాన్యత ?

Ileana

గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో పలు సూపర్ డూపర్ హిట్స్ తో స్టార్ స్టేటస్ పట్టేశాక బాలీవుడ్ బాట పట్టిన విషయం తెలిసిందే. అక్కడ కొన్ని సినిమాలు చేసి.. తిరిగి టాలీవుడ్ వంక చూస్తోంది. ఈ మేరకు ఇటీవలే రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో నటించి అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ అమ్మడికి నాగార్జున సరసన నటించే మరో అవకాశం దక్కిందని తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో ఇలియానాకు ఛాన్స్ ఇచ్చారని టాక్. ఇదిలా ఉండగా గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు తెలుగు కంటే తమిళ్ ఇండస్ట్రీకే ప్రాధాన్యత ఇస్తోందని కాస్టింగ్ వర్గాలు చెప్తున్నాయి. తెలుగు సినిమాల గురించి పక్కన పెట్టండి. తమిళ్ లో ఏదైనా క్రేజీ ప్రాజెక్ట్ ఉంటే చెప్పమంటుందట ఇలియానా.

Related posts