telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆ ఇంటిని కొనడానికి జనం ఎగబడుతున్నారు… ఎందుకంటే…!

House

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన స్టాన్లీ లాపిన్‌స్కీ తన ఇల్లు అమ్మకానికి పెట్టాడు. అతని ఇంటి వివరాలు తీసుకున్న సు ఎల్లీస్ అనే రియల్టర్… ఈ ఇంటికి మంచి ధర వస్తుందని ధీమాగా చెప్పారు. ఆమె చెప్పినట్లే ప్రస్తుతం ఫ్లోరిడాలో ఆ ఇల్లు కొనడానికి చాలామంది ఎగబడుతున్నారు. అందుకు ఓ కారణం ఉంది. ఆ ఇంట్లో అండర్‌గ్రౌండ్ బాంబ్ షెల్టర్ ఉండటమే. 1960లలో కోల్డ్‌వార్ జరుగుతున్న సమయంలో ఈ ఇల్లు నిర్మించారు. ఆ కారణంగానే ఈ ఇంటిలో బాంబ్ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. ఇంటి డ్రైవ్ వే వద్ద ఈ బాంబ్ షెల్టర్‌లోకి వెళ్లడానికి తలుపు ఉంది. ఇగ్లూలా ఉండే ఈ షెల్టర్ చూడముచ్చటగా ఉంటుందని, దానిలోకి వెళ్లడానికి స్పైరల్ స్టెయిర్‌కేస్ (వృత్తాకారంలో ఉండే మెట్లు) ఉన్నాయని స్టాన్లీ కుమార్తె చెప్పింది. లోపలకు వెళ్తే సబ్‌మెరీన్‌లో ఉన్న అనుభూతి కలుగుతుందని తెలిపింది. గతంలో నేవీలో పనిచేసిన స్టాన్లీ.. గత 30 ఏళ్లుగా ఆ ఇంట్లో ఉంటున్నాడు. కుటుంబంతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లాలని ఇటీవలే నిర్ణయించుకున్నాడు. దాంతో ఈ ఇంటిని అమ్మకానికి పెట్టాడు. ఇలాంటి ఇల్లు అమ్మకానికి రావడం చాలా అరుదని, అందువల్లే దీనికి భారీ డిమాండ్ ఉందని సూ ఎల్లీస్ పేర్కొన్నారు.

Related posts