telugu navyamedia
సినిమా వార్తలు

విడాకులకు ఆమే కారణమంటూ పుకార్లు… ఫైర్ అయిన హీరోయిన్

Dia

హైదరాబాదీ భామ, సీనియర్ హీరోయిన్ దియా మీర్జా స్వయంగా భర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ప్రముఖ వ్యాపారవేత్త సాహిల్‌ సంఘాతో 11 ఏళ్ళు ప్రేమాయణం సాగించిన దియా 2014లో వివాహం చేసుకుంది. అయితే వివాహం చేసుకుని ఐదేళ్లు కూడా పూర్తవకముందే వీరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ జంటకు పిల్లలు లేరు. “మేమిద్దరం గత పదకొండేళ్లుగా కలిసున్నాం. ఒకరి కష్టసుఖాలను మరొకరం పంచుకున్నాం. ఇప్పుడు విడిపోయాలని నిర్ణయించుకున్నాం. మా ప్రయాణాలు విభిన్న మార్గాలను ఎంచుకున్నాయి. విడిపోయినా మేం ఎప్పటిలా స్నేహితులుగానే ఉంటాం. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు మా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మీడియాకు ధన్యవాదాలు. ఈ సమయంలో మాకు కాస్త ప్రైవసీని కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఇక, ఈ విషయం గురించి నేను ఎలాంటి కామెంట్లు చేయదలచుకోలేదు. ధన్యవాదాలు” అని దియా పేర్కొంది.

అయితే దీనికి కారణంగా రాఘవేంద్రరావు కోడలు, ప్రకాష్ కోవెలమూడి భార్యా కనికా థిల్లాన్ అంటూ కొన్ని బాలీవుడ్ వెబ్ సైట్లు వార్తలు ప్రచురించాయి. దియా మీర్జా భర్త సాహిల్, కనికా కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారని.. ఆమె కారణంగానే సాహిల్-దియాలు విడిపోతున్నారని ఓ రేంజ్ లో వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ పుకార్లంటూ స్పందించింది దియామీర్జా. సాహిల్ తో తను విడిపోవడానికి కారణం పూర్తిగా వ్యక్తిగతమని.. తమ విడాకుల వ్యవహారంలో తమ సన్నిహితుల పేర్లు బయటకి తీసుకొచ్చి వాళ్ల ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారని.. ఓ మహిళగా మరో మహిళ ప్రతిష్టను దెబ్బతీసేలా వస్తోన్న అబద్ధాలను ఖండిస్తున్నట్లు చెప్పింది. సాహిల్ తో తన విడిపోవడానికి మూడో వ్యక్తి కారణం కాదని స్పష్టం చేసింది. ఇకనైనా పుకార్లు ఆపాలని, తమ వ్యక్తిగతానికి మీడియా గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పింది. తమ విడాకుల విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని తేల్చి చెప్పింది. మీడియా కాస్త సంయమనం పాటించి, తన అభిప్రాయాలను గౌరవిస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది.

Related posts