telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అత్యద్భుతమైన ప్రదేశాలు ఎన్నో… కానీ నాకు ఇక్కడే కంఫర్ట్‌ : కంగనా

Kangana

కంగ‌నా రనౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో ఏఎల్ విజ‌య్ తెర‌కెక్కిస్తున్న “త‌లైవీ” చిత్రం. విజయేంద్ర ప్రసాద్ కథ రాశారు. ‘తలైవి’ బయోపిక్‌ను విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీలో సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో అర‌వింద‌స్వామి దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి, లెజెండరీ యాక్టర్‌ ఎంజీ రామ‌చంద్రన్ (ఎంజీఆర్‌) పాత్రలో న‌టిస్తున్నారు. అలాగే మ‌రో లెజెండ్రీ పొలిటీషియ‌న్, దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి క‌రుణానిధి పాత్రలో విల‌క్షణ న‌టుడు ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. బ్లేడ్ ర‌న్నర్‌, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో వ‌ర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్ట్ కంగ‌నా ర‌నౌత్‌ను జ‌య‌ల‌లిత‌గా చూపిస్తున్నారు. దర్శకుడు విజయ్ శోభన్ బాబు పాత్రకు ప్రముఖ బెంగాలీ నటుడు జిషు సేన్‌గుప్తాను ఎంపిక చేసారు. ఇక లాక్ డౌన్ కారణముగా దాదాపు ఆరు నెలలు షూటింగ్ కు దూరమైన కంగనా తాజాగా షూటింగ్ స్పాట్ లోకి అడుగు పెట్టింది. లొకేషన్‌లో ఏదో సీన్‌కు సంబంధించి దర్శకుడు ఏఎల్ విజయ్‌తో డిస్కస్‌ చేస్తున్న కంగనా ఆ ఫోటోలను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నిన్న ఉదయం సీన్ డిస్కషన్‌లో దిగిన ఫోటోస్ ఇవి. ప్రపంచంలో అత్యద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. కాని నాకు చాలా కంఫర్ట్‌గా ఉన్న స్థలం మూవీ సెట్ అంటూ కంగనా పోస్ట్ చేసింది.

Related posts