telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ ఏడాది మంచి పేరు తెచ్చుకున్న ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ భామ..!

తెలుగు సినిమా రంగంలో ప్రతి యేడాది తెలుగు అమ్మాయిల కంటే పరభాషా కథానాయికలే ఎక్కువగా పరిచయం అవుతుంటారు. అయితే… ఈ సంవత్సరం విడుదలైన సినిమాల సంఖ్య బాగా తక్కువగా ఉండటం… ఎక్కువ చిత్రాలు ఓటీటీ ద్వారానే స్ట్రీమింగ్ కావడంతో కొత్త ముద్దుగుమ్మల ఆగమనం కూడా అంతంత మాత్రంగానే జరిగింది. అలా వచ్చిన వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వర్ష బొల్లమ్మ గురించి మాత్రమే!
ఇప్పటికే మలయాళ, తమిళ చిత్రాలలో నటించి చక్కని గుర్తింపు తెచ్చుకున్న వర్ష బొల్లమ్మ ఈ యేడాది ఏకంగా మూడు స్ర్టయిట్ చిత్రాలలో నటించింది. శివ కందూకూరి హీరోగా నటించిన ‘చూసి చూడంగానే’ చిత్రంలోనూ, ఆనంద్ దేవరకొండ నటించగా ఓటీటీలో విడుదలైన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’లోనూ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. తమిళ చిత్రం ’96’లో పోషించిన పాత్రనే ఆ సినిమా తెలుగు రీమేక్ ‘జాను’లోనూ వర్ష బొల్లమ్మ ప్లే చేసింది. అంతేకాదు… ఇప్పుడు తెలుగులో ఒకటి రెండు సినిమాలకూ వర్ష కమిట్ అయ్యింది. సో… ఈ యేడాది తెలుగువారి ముందుకొచ్చిన ప్రామిసింగ్ హీరోయిన్ గా వర్ష బొల్లమ్మనే చెప్పుకోవాలి. ఇదే సినిమాతో మాళవిక సతీశన్ సైతం తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యింది. మలయాళ చిత్రం ‘ఒరు అడార్ లవ్’ డబ్బింగ్ వర్షన్ ‘లవర్స్ డే’తో తెలుగువారికి పరిచయమైన నూరిన్ ‘ఉల్లాల ఉల్లాల’ సినిమాతో కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నరసింహ నంది దర్శకత్వం వహించిన ‘డిగ్రీ కాలేజ్’తో కన్నడ నటి దివ్యారావ్ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. సినీ రచయిత, నటుడు కె.ఎల్. ప్రసాద్ మొదటి సారి మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన ‘స్క్రీన్ ప్లే’ మూవీతో ప్రగతి యాథాటి నటిగా పరిచయమైంది. కన్నడ నటి అమిత రంగనాథ్‌ (అమృతా రామమ్), సలోనీ లూద్రా (భానుమతి అండ్ రామకృష్ణ), దృశిక చందర్ (బుచ్చినాయుడు కండ్రిగ), శివశక్తి సచిదేవ్ (అమరం అఖిలం ప్రేమ), పూజిత కురపర్తి (గతం), ప్రియాలాల్ (గువ్వ గోరింక), దుర్గ గదె (కళాకారుడు), శ్రీ పల్లవి (నీవల్లే నేనున్నా), ప్రీతీ ఆస్రానీ (ప్రెజర్ కుక్కర్), తృష్ణ ముఖర్జీ (మద) వంటి వారూ ఈ యేడాది స్ట్రయిట్ తెలుగు సినిమాలతో ప్రేక్షుకులను అలరించే ప్రయత్నం చేశారు.

Related posts