telugu navyamedia
సినిమా వార్తలు

కౌశల్ కు టీవీ5 మూర్తి సవాల్

Murthy-and-Kaushal

బిగ్ బాస్ విన్నర్ కౌశల్ “కౌశల్ ఆర్మీ” పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్ట్ లోని విరాళాలను దుర్వినియోగం చేస్తున్నాడని కౌశల్ ఆర్మీ సభ్యులు మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో వివరణ ఇవ్వడానికి మీడియా ముందుకొచ్చిన కౌశల్ టివీ5 ప్రముఖ జర్నలిస్ట్ మూర్తితో కలిసి తనీష్ తనపై అబద్ధపు ప్రచారం చేయిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు కౌశల్ ఆరోపణలపై స్పందిస్తూ మూర్తి చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం ఇంకా ముదిరినట్టుగా అన్పిస్తోంది.

కౌశల్ తాను చేసిన ఒక్క ఆరోపణనైనా నిరూపించుకోగల్గితే జర్నలిజం మానేస్తానని, మూర్తి తప్పు చేశాడని కౌశల్ ఆర్మీ సభ్యుల్లో ఎవరైనా నిరూపిస్తే తాను ఉరి తీయించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, ఒకవేళ తాను చనిపోయాక నిరూపితమైతే తన సమాధి దగ్గరకు వచ్చి ద్రోహి అంటూ బహిరంగంగా ముద్ర వేయమని ఫైర్ అయ్యారు. లక్షల మంది ఆర్మీ ఉందని, వారందరితో ట్రోలింగ్ చేయిస్తానని ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేయిస్తారు ? మీరు బెదిరిస్తే మేము బెదిరిపోవాలా ? మీతో సినిమా చేయడానికి ఒప్పుకొని వాళ్లంతా క్రిమినల్సా ? అంటూ కౌశల్ పై మూర్తి మండిపడ్డారు.

Related posts