telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నటి సంజ్జన కు నో బెయిల్…

Sanjana

డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి జైల్లో ఉన్న స్యాండిల్ వుడ్ క్వీన్, బహుబాష నటి సంజనా గల్రానీకి సినిమా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి, తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని నటి సంజనా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు వాయిదా వేసింది సంజనా కు బెయిల్ ఇవ్వాలని ఏకంగా కోర్టుకు, బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయాలకు బాంబులు పెట్టి పేల్చేస్తాం అంటూ బెదిరింపు లేఖలు వచ్చాయని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తారా,??? సంజనాకు, నిందితులకు లింక్ ఏమిటి ? అనే విషయం తేలాలి, ఆలోచించండి అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయమూర్తికి మనవి చేశారు. సంజనాకు బెయిల్ ఇవ్వడానికి అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. సంజనా గల్రానీని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సెప్టెంబర్ 8వ తేదీన అరెస్టు చేశారు.

కోర్టు ఆదేశాలతో నటి సంజనాను బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి నటి సంజనా బెయిల్ తీసుకుని జైలు నుంచి బయటకు రావాలని నేటి వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే సంజనా అరెస్టు అయ్యి జైలుకు వెళ్లి 41 రోజులు పూర్తి అయ్యింది. సంజనా కంటే ముందు నటి రాగిణి ద్వివేది కూడా డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి అదే పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో కాలం గడుపుతూ ఉంది. సంజనా బెయిల్ పిటిషన్ ను బెంగళూరు ప్రత్యేక కోర్టు ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ రాకపోవడంతో నటి సంజనా మరోసారి నిరాశకు గురైయ్యింది. మొత్తం మీద కోర్టుకు, పోలీసు అధికారులకు వార్నింగ్ ఇస్తూ లేఖలు రాయడంతో నటి సంజనా పై ఆమె అభిమానులే విమర్శలు చేస్తున్నారు..

Related posts