యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆగష్టు 18న ‘సాహో’ గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు భారీస్థాయిలో ప్రభాస్ ఫ్యాన్స్ హాజరయ్యారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ప్రభాస్ తీసుకున్న పారితోషికం గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలో ప్రభాస్ 100 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ప్రభాస్ ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యులయ్యారు. భాగస్వామి అవడం వల్ల వారి పెట్టుబడి పోగా మిగిలిన మొత్తం షేర్ మొత్తం 100 కోట్లు ప్రభాస్‌కు మిగులుతుందట. ఈ విషయంపై “సాహో” సినిమా ప్రచారంలో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు ప్రభాస్. తన రెగ్యులర్ పారితోషికం నుంచి 25 శాతం నిర్మాతలకు ఇచ్చానని, సినిమా బడ్జెట్ ఎక్కువైన కారణంగా పారితోషికం వారికి భారం కాకూడదని నిర్ణయించుకుని చాలా తక్కువగా తీసుకున్నానని క్లారిటీ ఇచ్చారు ప్రభాస్. ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయంతో నిర్మాతలు షాక్ అయ్యారట.
previous post