telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పుట్టిన రోజే… నాకు సచ్చిన రోజు అంటూ… వర్మ సంచలన ట్వీట్‌ !

varma

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. వివాదాస్పద సినిమాలు తీయడమే కాదు వరుసగా సినిమాలు ప్రకటిస్తుంటారు కూడా. అయిత్ వాటిలో కొన్ని సెట్స్ మీదకు వెళతాయి.. మరికొన్ని ప్రకటించిన దగ్గరే ఆగిపోతాయి. కరెంట్ ఇష్యూలను తీసుకుంటూ ఆయన చేసే ప్రకటనలకు ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అయితే..ఎప్పుడూ వివాదాస్పద, వ్యంగ్య కామెంట్లతో వార్తల్లో నిలిచే వర్మ.. తాజాగా మరోసారి తనదైన శైలిలో తన పుట్టిన రోజు గురించి చెప్పుకొచ్చాడు. “ఇవాళ నా పుట్టిన రోజు కాదు.. వాస్తవానికి నా డెత్‌ డే… ఎందుకంటే నా ఆయుష్షులో ఒక ఏడాది తగ్గిపోయింది” అంటూ ఇవాళ వర్మ ట్వీట్‌ చేశారు. ఏడుపు మొహం ఎమోజీను పోస్ట్‌ చేశాడు. దీంతో ఆర్జీవీ పోస్ట్‌ నెటిజెన్స్‌ కూడా కామెంట్స్‌ పెడుతున్నారు. ఆర్జీవీ నీ రూటే సెపరేటయ్యా అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు.

Related posts