telugu navyamedia
సినిమా వార్తలు

అల్లుని కన్నా అత్త చిన్నది… షాకిచ్చిన సినీ ప్రముఖుని భార్య

Ankita-and-Milind

బాలీవుడ్ నటుడు, మోడల్, ప్రొడ్యూసర్ ఫిట్‌నెస్ ప్రమోటర్ అయిన మిలింద్ సోమన్ తన కన్నా 26 ఏళ్లు తక్కువ వయసు కలిగిన యువతిని వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారు. మిలింద్, అంకితల వివాహం 2018, ఏప్రిల్ 22న జరిగింది. వీరి వివాహం జరిగి ఏడాది పూర్తయిన తరువాత వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరు తమ లవ్‌స్టోరీ గురించిన వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అంకిత ఈ వీడియోతో పాటు ‘ఒక ఏడాది ఆనందంగా గడిచింది. నీతోడు ఉండగా నా జీవితమే మారిపోయింది. నువ్వు నా ప్రతీరోజునూ మరింత ఉత్తమంగా మలిచావు’ అని భర్తను ఉద్దేశించి రాసింది. దీనికి బదులుగా మిలింద్ కూడా ఆమెకు ప్రేమ పూర్వక మెసేజ్ అందించారు. ‘ ఈ ఏడాది ఎంతో అందమైనది. అయితే దానికన్నా నువ్వెంతో అందమైనదానివి’ అని రాశారు. కాగా అంకిత తమ అనుబంధం గురించ తన తల్లి దండ్రులకు తెలియగానే వారు ఎలా స్పందించారో తెలియజేసింది. “మా అమ్మ కొంత ఆందోళన పడింది. అప్పుడు మిలింద్ నాతో మా అత్త నాకన్నా వయసులో చిన్నది అన్నారు. ఎట్టకేలకు మా అమ్మ మిలంద్‌తో నా వివాహానికి అంగీకరించింది” అని అంకిత తెలిపారు.

Related posts