telugu navyamedia
రాజకీయ

ఉక్రెయిన్​లో ఉద్రిక్తంగా పరిస్థితులు -బార‌త్ రాయ‌బారి

*ఉక్రెయిన్ పై విరుచుకు ప‌డుతున్న ర‌ష్యా..
*కీవ్‌వైపు ఎట్టిప‌రిస్థితుల‌పై రావొద్దు..
*రష్యా ఆధీనంలోకి ఉక్రెయిన్ విమానాశ్రయం…
*ఉక్రెయిన్ లోకి చొచ్చుకెళ్లిన రష్యన్ యుద్ద ట్యాంకులు…
*ఉక్రెయిన్‌లోని ఉన్న విద్యార్ధులు త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌లు..
*ఉక్రెయిన్ పై రష్యా దాడిలో 300మంది మృతి…

ఉక్రెయిన్​లో పరిస్థితిలు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయని, ఇది చాలా ఆందోళన కలిగిస్తోందన్నారు ఉక్రెయిన్​లోని భారత రాయబారి తెలిపారు. విమానాశ్రాయాలు మూసివేశారని, రైల్వేలు నడిచే పరిస్థితులు కనిపించటం లేదని, రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్​ నిలిచిపోయినట్లు చెప్పారు.

ఉక్రెయిన్​లోని పౌరులు శాంతియుతంగా ఉండాలని, పరిస్థితులను ధైర్యంతో ఎదుర్కోవాలని సూచించారు. కివీలోని భారత రాయబార కార్యాలయం తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్​లోని భారత సంతతి ప్రజలను కలిసి.. భారతీయులకు సాయంగా నిలవాలని కోరినట్లు చెప్పారు రాయబారి.

ఉక్రెయిన్‌లో మార్షల్ లా అమల్లో వుందని..ప్రయాణాలు కష్టంగా మారాయని పేర్కొంది. కీవ్‌లో చిక్కుకున్న వారి కోసం స్థానిక యంత్రాంగంతో సంప్రదింపులు…జరుపుతున్నామని.. కీవ్‌లో బాంబు వార్నింగ్‌లు, ఎయిర్‌ సైరన్ల మోత వుందని సైరన్ వినిపిస్తే గూగుల్ మ్యాప్ సాయంతో బాంబ్ షెల్టర్లకు చేరుకోవాలని భారత రాయబార కార్యాలయం తెలిపింది. పాస్‌పోర్టులతో వీలైనంత వరకు ఇళ్లలోనే వుండాలని తెలిపింది…

మ‌రోవైపు..ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన భారత పౌరులు, విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. భారత్​ ఎప్పుడు శాంతిని కోరుకుంటుందని, ఎలాంటి పరిస్థితులు యుద్ధానికి దారితీయకూడదన్నారు.

Related posts