telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వచ్చే నెల భారత్‌కు మరో 10 రఫేల్‌ యుద్ధ విమానాలు

IAF got first rafel fighter plane

భారత్‌కు మరికొన్ని రఫేల్‌ జెట్లు రాబోతున్నాయి. ఇప్పటికే భారత అమ్ములపొదిలో 11 రఫేల్‌ యుద్ధ విమానాలు వచ్చి చేరగా.. వాటికి జతగా మరో 10 వచ్చే నెల భారత్‌లో అడుగుపెట్టబోతున్నాయి.
59 వేల కోట్ల రూపాయల వ్యయంతో… 2016లో ఫ్రాన్స్ నుంచి మొత్తం 36 రఫేల్‌ జెట్‌లను కొనుగోలు చేసింది భారత్‌. ఫ్రాన్స్‌లోని ప్రముఖ యుద్ధ విమానాల తయారీ సంస్థ డసాల్ట్‌ వీటిని రూపొందిస్తోంది. ఒప్పందంలో భాగంగా ఇప్పటి వరకు మూడు విడతలుగా మొత్తం 11 రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు చేరుకున్నాయి. వచ్చే నెలలో మరో 10 రఫేల్‌ జెట్స్‌ ఇండియాకు రానున్నాయి. 10 రఫేల్‌ జెట్లు వచ్చే నెల అంబాలా ఏయిర్‌ బేస్‌కు చేరుకోనున్నాయని ఏయిర్‌ ఫోర్స్‌ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి చేసుకున్న 11 రఫేల్‌ యుద్ధ విమానాలు భారత సైన్యంలో సేవలందిస్తుండగా.. ఇప్పుడు నాలుగో దఫాలో రానున్న ఈ ఫైటర్‌ జెట్స్‌తో భారత వైమానిక దళం మరింత పటిష్టం కానుంది. మిగతా రఫేల్‌ జెట్స్‌ డెలీవరీ కావడానికి మరో రెండేళ్లు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం భారత్‌ వద్ద ఉన్న ఫైటర్‌ జెట్స్‌లో రఫేలే అత్యాధునికమైనది. అత్యంత శక్తివంతమైనది కూడా. శత్రువుల వెన్నులో వణుకుపుట్టించడం రఫేల్‌ జెట్‌కే సాధ్యం.

Related posts