telugu navyamedia
సినిమా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యూట్యూబర్​ గాయత్రి మృతి..

ప్రముఖ యూట్యూబర్‌, జూనియర్​ ఆర్టిస్ట్​ గాయత్రి ఎకా డాలీ.. శుక్రవారం రాత్రి గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. హోలీ వేడుకల్లో పాల్గొన్న అనంతరం స్నేహితుడు రోహిత్​తో కలిసి సైబరాబాద్​లోని విప్రో జంక్షన్‌ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పై బోల్తా పడింది. ఈ ఘటనలో గాయత్రి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. రోహిత్​కు తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులోనే గచ్చిబౌలి ప్రమాదం జరిగినట్టు పోలీసులు తేల్చారు.

Junior Artist Ganyatri Died In Road Accident - Sakshi

గాయిత్రి మరణవార్త తెలుసుకుని తోటి నటీనటులు, సోషల్ మీడియా ఫ్రెండ్స్ అంతా కన్నీటి సాగరంలో మునిగిపోయారు. మరోవైపు ఈమె మరణంపై ప్రముఖ నటి సురేఖ వాణి కూడా సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేసింది. “ఇది అన్యాయం డాలీ. నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. నీతో ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు మాటలు రావడం లేదు” అని సురేఖా వాణి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక పోస్ట్ చేసింది..యూట్యూబ‌ర్ షణ్నూక్‌ సైతం గాయత్రితో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ హార్ట్‌ బ్రేక్‌ సింబల్‌ను జతచేశాడు.

 "ఇది అన్యాయం డాలీ. నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. నీతో ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు మాటలు రావడం లేదు" అని సురేఖా వాణి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక పోస్ట్ చేసింది. దాంతో ఎవరబ్బా ఈ డాలి (గాయత్రి) అంటూ ఆరా తీస్తే ఆ తర్వాత తెలిసింది ఆమె ప్రముఖ యూ ట్యూబ్ నటి అని. రెగ్యులర్‌గా యూట్యూబ్‌లో తెలుగు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు చూసే వాళ్ళకు ఆమె సుపరిచితులే.,[object Object]

నటి సురేఖా వాణి, ఆమె కుమార్తె సుప్రీతకు గాయత్రి చాలా క్లోజ్. గతంలోనూ సురేఖా వాణి ఫ్యామిలీతో కలిసి గోవా వెళ్లింది డాలి. అక్కడే ఈమె పుట్టినరోజు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. డాలీ మృతిపై కన్నీటి పర్యంతం అయింది సురేఖా వాణి.

Junior Artist Ganyatri Died In Road Accident - Sakshi

 

డాలీ అసలు పేరు డాలీ డి క్రూజ్ . కానీ ఈమె గాయత్రి, అనే స్క్రీన్ నేమ్‌తో యూ ట్యూబ్‌లో కనిపిస్తుంది. బిగ్ బాస్’ ఫేమ్ సిరి హనుమంతు నటించిన ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ అనే వెబ్ సిరీస్‌లో హీరో శ్రీహన్ మీద మనసు పారేసుకునే అమ్మాయిగా నటించింది. అలాగే షణ్ముఖ్ జస్వంత్‌తోనూ నటించింది డాలి. ‘జల్సారాయుడు’ యూ ట్యూబ్ ఛానల్‌లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసింది గాయత్రి.

Related posts