అరుడగులు అందగాడు, నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్‌డే బుధవారం (జనవరి 19). ఈ సందర్భంగా చిరంజీవి కూతురు శ్రీజ.. తన సోదరుడికి బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పుట్టిన రోజు శుభాకాంక్షలు తమ్ముడు. పొడుగ్గా ఉన్నంత మాత్రాన తెలివైన వాళ్లమని అనిపించుకోలేరు. అందుకే నీ కోసం నేను ఉన్నాను. నా బాల్యాన్ని ఎంతో సంతోషంగా గడిచేలా చేశావు. అంతేకాదు నాకు సపోర్ట్‌గా ఉన్నావు. ఎంతో ప్రేమను చూపించావు. నీ మీద నాకు మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉంది’అంటూ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
ఈ సందర్భంగా ఆమె వరుణ్‌తేజ్‌తోపాటు వైష్ణవ్ తేజ్‌తో కలిసి దిగిన రీసెంట్ ఫోటోని పంచుకుంది. దీంతోపాటు వరుణ్‌తేజ్, శ్రీజ చిన్నప్పటి ఫోటో పంచుకుంది. చిన్ననాటి ఫోటోలో ఇద్దరు నవ్వులు చిందుతూ ఎంతో క్యూట్‌గా ఉన్నారు. ప్రస్తుతం శ్రీజ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కంగనాపై కామెంట్స్ తో షాకిచ్చిన అలియా