telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రానా యూట్యూబ్ ఛానెల్ “సౌత్ బే”

Rana

స్టార్ హీరో ద‌గ్గుబాటి రానా తాజాగా యూట్యూబ్ ఛానెల్ మొదలు పెట్టబోతున్నట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క‌రోనా వ‌ల‌న థియేట‌ర్స్ ఓపెన్ చేసే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో ఎంట‌ర్‌టైన్‌మెంట్ మాధ్య‌మాల‌తో ప్ర‌జ‌ల‌కు వినోదం అందించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సౌత్ బే అనే పేరుతో కొత్త యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశారు డు రానా. పది సెకన్ల నుండి పది గంటల నిడివితో పలు భాషలకు సంబంధించిన కథలు ఇందులో అందుబాటులో ఉంటాయి. క‌థలే కాకుండా న్యూస్‌, యానిమేషన్‌, ఫిక్షన్‌ అంశాలకు సంబంధించిన స‌మాచారం అందుబాటులో ఉంటుంది. టాలెంట్ ఉన్న వాళ్ల‌కి ఈ ఛానెల్‌లో అవ‌కాశాలు కూడా క‌ల్పిస్తామ‌ని అంటున్నారు. ఇక రానా న‌టుడిగానే కాదు నిర్మాత‌గాను రాణించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అప్ప‌ట్లో కొత్త ఓటీటీ సంస్థ‌ని ప్రారంభించ‌నున్నాడ‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్చ‌ల్ చేశాయి. కాని దానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు.

Related posts