అందగాడు..అమ్మాయిల రాకుమారుడు ఘట్టమనేని ప్రిన్స్ మహేష్ బాబు నటనతో ఎంతో మంది హృదయాలను కోల్లగొట్టాడు. వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలో కూడా భారీ లెవెల్లో మన హీరోకి ఫాలోవర్స్ ఎక్కువే.
హీరోహీరోయిన్లు.. తమ వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా అప్‌డేట్స్‌ను సైతం సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. దీంతో తమ అభిమాన తారలను లక్షలాది మంది ఫాలో అవుతున్నారు. అందులో సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి అలాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు.
ఇప్పటికే టాలీవుడ్ లో ట్విట్టర్ నుంచి అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ఏకైక హీరోగా మహేష్ ఉండగా ఫేస్‌బుక్‌లో ఫాలో అయ్యేవారి సంఖ్య 15 మిలియన్లు మార్క్ క్రాస్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు నెట్టింట సంబరాలు జరుపుకుంటున్నారు. దీంతో మహేశ్‌బాబు పేరు నెట్టింట మార్మోగిపోతోంది. మరో పక్క ఆయన యాడ్ షూటింగ్‌లో పాల్గొన్న ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేశ్‌బాబు తాజాగా ‘సర్కారువారి పాట’ సినిమా గోవా షెడ్యూల్ ఇటీవల పూర్తయింది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయిక. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతోంది.