telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 2(గురువారం) రాశి ఫలాలు

మేషం: నిరుద్యోగులు శుభవార్త వింటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికత పెరుగుతుంది. ప్రేమ వ్యవహరాలు ఫలిస్తాయి. వ్యాపారులు బాగా పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం: సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు నెరవేరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇల్లు కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకుంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఖర్చు విషయంలో జాగ్రత్త వహిస్తారు.

మిథునం: ఆర్థికంగా బాగుంటుంది. చిన్నప్పటి స్నేహితులు పలకరిస్తారు. శుభకార్యం తలపెడతారు. ఉద్యోగం విషయంలో అనుకూల సమాచారం అందుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

కర్కాటకం: ఆర్థిక వ్యవహారాలు ఫలిస్తాయి. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త. వ్యాపారులు నష్టాల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్త.

సింహం: ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది. కుటుంబసభ్యులతో ఆలయానికి వెళతారు. వ్యాపారులు ఆర్థికంగా పుంజుకుంటారు.

కన్య: ఉద్యోగంలో శ్రమ పెరుగుతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చు విషయంలో జాగ్రత్త. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల: వ్యాపారులు, వృతి నిపుణులకు అనుకూలంగా ఉంది. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మున్ముందు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.

వృశ్చికం: ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగువేయాలి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత.

ధనుస్సు: శుభకార్యం తలపెడతారు. పెళ్లి వ్యావహారాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. వ్యాపారులకు ఆర్థికంగా బాగుంటుంది.

మకరం: ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. వ్యాపారుల లాభాలు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్త.

కుంభం: మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. శ్రమ మీద కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వ్యాపారులు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం జాగ్రత్త.

మీనం: ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వివాహ సంబంధం కుదురుతుంది. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. వ్యాపారులకు బాగుంటుంది.

Related posts