telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబర్ 19, మంగళవారం రాశిఫ‌లాలు..

మేషం
పనుల్లో స్వల్ప ఆటంకాలు క‌లుగుతాయి..నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ఆదరణ లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేప‌డ‌తారు. ఇంటాబయటా సమస్యలు అధిక‌మ‌వుతాయి. అనారోగ్యం క‌లుగుతుంది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. మిత్రులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృషభం
కార్యసాధనలో ఓర్పు, పట్టుదలతో శ్రమించండి, సత్ఫలితాలు లభిస్తాయి. సన్నిహితులతో సఖ్యత ఏర్ప‌డుతుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు తలెత్తుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జ‌రుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో అనుకూలత. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మిథునం
బంధువుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. వ్యాపార‌ వ్యవహారాలలో విజయం చేకురుతుంది. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో ఆదరణ ల‌భిస్తుంది. వాహనాలు కొంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి

కర్కాటకం
పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేప‌డ‌తారు. ఆలయాలును సందర్శిస్తారు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఏర్ప‌డుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్ల‌ల‌కు సంతోషాన్ని క‌లుగ‌జేస్తారు.నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం.

సింహం
సన్నిహితులతో మాటపట్టింపులు ఎక్కువ‌వుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఉదర సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. ముఖ్య వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం, అనారోగ్యం, వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. విద్యార్ధులు ఒత్తిడి, భయాందోళనలకు గురవుతారు.

కన్య
దూరపు బంధువుల కలయిక. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.సన్నిహితులతో కలిసి దైవ, శుభకార్యాల్లో పాల్గొంటారు.

తుల
వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను ధీటుగా ఎదుర్కుంటారు. బంధువులతో శుభవార్తలు వింటారు. వాహనయోగం చేస్తారు. చర్చలు సఫలం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి.

వృశ్చికం
సన్నిహితులతో విభేదాలు నెల‌కొంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఆస్తి వివాదాలు ఏర్ప‌డ‌తాయి. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు ఏర్ప‌డ‌తాయి. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. దైవ దర్శనాలకు అనుకూలంగా ఉంటాయి.

ధనుస్సు
వ్యాపార రంగంలో రాబడి అంతగా కలసిరాదు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో ఏకాగ్రత వహించండి. దూరప్రయాణాలు . బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. భూవివాదాలు నెలకొంటాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.

మకరం
కుటుంబసభ్యులతో సత్సంబంధాలు. కలప, సిమెంటు, ఐరన్ వ్యాపారులకు పురోభివృద్ధి. కోర్టు వ్యవహరాల్లో అనుకూల ఫలితాలుంటాయి. రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. చిన్ననాటి మిత్రుల‌ను క‌లుసుకుంటారు. సంఘంలో ఆదరణ ల‌భిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కుంభం
కుటుంబంలో చికాకులు ఏర్ప‌డ‌తాయి. దంపతుల మధ్య ప్రేమాను బంధాలు నెలకొంటుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. పనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ‌వుతాయి. అనారోగ్య సూచనలు క‌నిపిస్తున్నాయ‌ని, సన్నిహితులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మీనం
విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత, మెళుకువ అవసరం. ఒకానొక సందర్భంలో మీ కుటుంబీకుల ధోరణి అసహనం కలిగిస్తుంది.పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి ఏర్ప‌తాయి. కుటుంబ ప‌రిస్థితి సంతృప్తిక‌రంగా ఉంటుంది.

Related posts