telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబర్ 4(సోమవారం) రాశి ఫలాలు

మేషం: ఉద్యోగులకు అనుకూలం. అధికారులపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. కుటుంబం విషయంలో చక్కటి ఫలితాలు. వ్యాపారులకు లాభదాయకం.చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. స్నేహితుల సహకారం లభిస్తుంది.

వృషభం: ఆర్థికంగా బాగుంటుంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అనుకూలం. చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు.  వివాదాలకు దూరంగా ఉండండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఖర్చులను అదుపుచేయాలి.

మిథునం: ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో మీ లక్ష్యం పూర్తవుతుంది. అవసరానికి డబ్బు అందుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అప్పులు తీరుస్తారు.

కర్కాటకం: ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు బాగుంటుంది. చేపట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. స్నేహితుల సహకారం అందుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు లాభదాయకం.

సింహం: ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు. వ్యాపారులకు అన్ని విధాలా లాభదాయకం. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభ వార్తలు వింటారు. కుటుంబ సమస్య పరిష్కారానికి కృషిచేస్తారు.

కన్య: ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగులకు అనుకూలం. వ్యాపారులకు ఒత్తిడి పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. స్నేహితుల సహకారం అందుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి.

తుల: ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగంలో ఏకాగ్రత అవసరం. వ్యాపారులకు లాభదాయకం. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ చర్చించవద్దు. కుటుంబ సమస్య పరిష్కారమవుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వివాదాలకు దూరంగా ఉండండి.

వృశ్చికం: ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల మన్ననలు ఉంటాయి. ఉత్సాహంగా గడుపుతారు. మీవల్ల ఇతరులకు ప్రయోజనం చేకూరుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధువుల ఒత్తిడి ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు.

ధనుస్సు: ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. సమయం అనుకూలంగా ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు పరవాలేదు.

మకరం: ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు అనుకూలం. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి.

కుంభం: ఆర్థికంగా చాలా బాగుంది. వ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగంలో సమస్యలు రాకుండా చూసుకోవాలి. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేయండి. స్నేహితుల సహకారం అందుతుంది. ముఖ్యమైన సమస్యను పరిష్కరిస్తారు. సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి.

మీనం: ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. మీవల్ల ఇతరులకు మేలు కలుగుతుంది. వ్యాపారులకు నిలకడగా ఉంటుంది.

Related posts