పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..కు ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. ఆ పేరు చెప్పగానే తెలుగువారు ఎక్కడ ఉన్నా ఓ వైబ్రేషన్ తాకుతుంది. సినిమా నటుడిగా ఉన్నా, రాజకీయ నాయకుడిగా మారిన క్రేజ్ ఏ మాత్రం తగ్గని రేంజ్ ఆయనది. బాక్సాఫీస్ దగ్గర ఎన్నో లెక్కలు తేల్చిన ఈ స్టార్ నటుడు.. ఆయన నటించిన సినిమా ప్లాపైనా రికార్డు రేంజ్ కలెక్షన్లతో దూసుకుపోతుంది.
ఆయన నటనతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.అంతెందుకు ఆయన కటౌట్ కనపడితేనే ఓ ఎమోషన్. ఎందుకంటే ఆయన అందరిలా వచ్చివెళ్లిపోయే వ్యక్తి కాదు… సమాజం కోసం ఉద్భవించిన శక్తి. కొణిదెల పవన్‌కల్యాణ్..ఇప్పుడు జనసేనానిగా మారి ప్రజల హృదయాలను ఏలే దిశగా ముందడుగు వేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు సినిమా సినీఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. అనతి కాలంలోనే అన్నకు తగ్గ తమ్ముడిగా గుర్తింపు పొందారు. క్రమక్రమంగా సినిమాల్లో ఆకాశమంత ఎత్తుకు వర్ స్టార్‌గా ఎదిగారు. అతడ్ని కథానాయకుడిగా ఎంత మంది అభిమానిస్తారో, వ్యక్తిగా అంతకంటే ఎక్కువగా ఆరాధిస్తారు.
బాల్యం..
కొణిదెల వెంకటరావు, అంజనా దేవి దంపతులకు 1971 సెప్టెంబరు 2న బాపట్లలో జన్మించాడు పవన్ కల్యాణ్. ఇతడికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. పెద్దన్నయ్య చిరంజీవి, నటుడు నిర్మాత అయిన నాగబాబు రెండో అన్నయ్య.కంప్యూటర్స్‌లో డిప్లొమా చేసిన పవన్‌కల్యాణ్… సినిమా అంటే పెద్దగా ఆసక్తి లేకపోయినా అన్నయ్య చిరంజీవి సతీమణి సురేఖ ప్రోద్బలంతో హీరోగా మారాడు. ఆ తర్వాత పవర్ స్టార్‌గా మారి ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోలేని ముద్ర వేశాడు.
సినీ ప్రస్థానం..
1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంద్వారా పవన్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం, శంకర్ దాదా జిందాబాద్,జల్సా,కొమరం పులి,తీన్ మార్, పంజా, గబ్బర్ సింగ్, కెమెరామెన్ గంగతో రాంబాబు, అత్తారింటికి దారేది, గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు,అజ్ఞాతవాసి, వకీల్ సాబ్, హరి హర వీరమల్లు..
గబ్బర్ సింగ్ కుగాను తెలుగులో ఉత్తమ నటునిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకొన్నాడు. అత్తారింటికి దారేది చిత్రం వసూళ్ళలో అప్పటి వరకు తెలుగు సినీపరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిందని అంటారు. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లతో సినిమాలు నిర్మించాడు.
2015 లో గోపాల గోపాల చిత్రంలో మోడరన్ కృష్ణునిగా నటించాడు. 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2016 ప్రారంభంలో కాటమరాయుడు సినిమాలలో నటించాడు.త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 25వ చిత్రం ఆజ్ఞతవాసిలో నటించాడు. 2022లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా క్రేజీ కాంబోలో త్రివిక్రమ్ రచనా సారథ్యంలో.. సాగర్ చంద్ర డైరెక్షన్లో సినిమా తెరకెక్కుతోన్న భీమ్లా నాయక్ గా వస్తున్నాడు.
వ్యక్తిగత జీవితం
2009 జనవరి 28 న రేణు దేశాన్ని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు అకీరా నందన్, కూతురు ఆద్య. కొన్ని వ్యక్తి కారణాలు వల్ల విడిపోయారు. 2013 సెప్టెంబరు 30న ఇతని వివాహం రష్యా నటి అన్నా లెజ్‌నేవాతో హైదరాబాదు లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికిఇద్దరు పిల్లలు..
అవార్డులు
నవంబరు 2017 లో ఇండో-యూరపియన్ బిజినెస్ ఫోరమ్ నుండి గ్లోబల్ ఎక్సెలెన్స్ పురస్కారం అందుకొన్నాడు.నటుడిగా, రాజకీయవేత్తగా, సామాజిక సేవకుడిగా ఆయనను గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు.
రాజకీయ జీవితం..
2014 మార్చి 14న జనసేన అనే రాజకీయ పార్టీ స్థాపించాడు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తెలిపాడు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటోన్న శుభసందర్భాన పవర్‌స్టార్ పవన్‌కు నవ్య మీడియా స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్తుంది.
నరేశ్ గారు రేసింగ్ అనే పాయింట్స్ ఇప్పుడు వద్దు: నట్టికుమార్