telugu navyamedia
సినిమా వార్తలు

వెంకీ ఫ్యామిలీతో సమంత… ఫోటో వైరల్

Samantha-with-Venkatesh

టాలీవుడ్ సీనియర్ యాక్టర్, విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. జైపూర్ లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డిని వివాహం చేసుకుంది ఆశ్రిత. అయితే ఆ పెళ్లి సందర్భంగా తీసుకున్న ఓ ఫోటోని సమంత తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. వెంకీ ఫ్యామిలీతో కలిసి సామ్ తీసుకున్న ఈ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో వెంకీ, అతడి భార్య నీరజ, వారి ముగ్గురు కుమార్తెలతో పాటు సురేష్ బాబు కూతురు మాళవిక పొట్లూరి కూడా ఈ ఫోటోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సమంత, నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది. ఇంకా ’96’ రీమేక్ లో కూడా నటించడానికి సిద్ధమవుతోంది సమంత. ఇటీవల సమంత, నాగ చైతన్య జంటగా నటించిన “మజిలీ” చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

Related posts