తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలుఈ నెల 18న వెల్లడి కాగా, కొందరికి దిగ్భ్రాంతి కలిగించేలా మార్కులు వచ్చాయి. ఈ నేపథ్యంలో, సున్నా మార్కులు తెచ్చుకున్న విద్యార్థిని తెలుగు పేపర్ ను రీవాల్యుయేషన్ చేయించగా, దిమ్మదిరిగే రీతిలో 99 మార్కులు వచ్చినట్టు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అవకతవకలపై మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సాత్విక్ ఇంటర్ మొదటి సంవత్సరం ఎంఈసీ పరీక్షలు రాశాడు. అతనికి గణితం 1(ఎ)లో 17 మార్కులు వచ్చాయి. వాస్తవానికి 27 మార్కులు వస్తేనే ఉత్తీర్ణత లభిస్తుంది. కానీ ఇంటర్‌బోర్డు మాత్రం పాసయినట్టు రిజల్ట్ లో చూపింది.
previous post
next post