వివాదాలకు పేరు మోసిన దర్శకుడు, రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇప్పటికే విడుదల చేసిన వర్మ.. సోషల్ మీడియాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు బాగా ప్రచారం చేసుకుంటున్నారు.
తాజాగా వర్మ ఓ వీడియోను విడుదల చేశారు. తాను ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ఎందుకు తీశానో ప్రజలకు చెప్పాల్సిందిగా తనను ఎన్టీఆర్ కోరారని వర్మ తెలిపారు. అందుకే ఈ వాయిస్ మెసేజ్ ను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 రద్దు పై స్పందించిన రాహుల్