టాలీవుడ్ కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన తాజా చిత్రం “మన్మథుడు-2”. భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. సినిమాపై ఉన్న హైప్, ఆల్రెడీ మన్మథుడు లాంటి క్లాసిక్ మూవీ టైటిల్‌తో వస్తోన్న సినిమా కావడంతో పాటు నాగ్ ఫ్యామిలీ చేసిన ప్రమోషన్లతో సినిమా సూపర్ హిట్ అవుతుందనే అందరూ అనుకున్నారు. ఈ సినిమాకు ఏకంగా రూ.24 కోట్ల వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. కానీ ఫస్ట్ షోకే ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ సినిమా మీద హైప్ ఉండడంతో ఓపెనింగ్స్ అయితే బాగానే రాబట్టింది. తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.86 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒక్క నైజాం ఏరియాలోనే 1.3 కోట్లు వసూలు చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజు 5.03 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
ఏరియాల వారీగా వసూళ్లు
నైజాం – రూ.1.30 కోట్లు
సీడెడ్ – రూ.0.48 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.0.46 కోట్లు
ఈస్ట్ – రూ.0.35 కోట్లు
వెస్ట్ – రూ.0.28 కోట్లు
కృష్ణ – రూ.0.28 కోట్లు
గుంటూరు – రూ.0.54 కోట్లు
నెల్లూరు – రూ.0.18 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.3.86 కోట్లను రాబట్టింది. కర్ణాటకలో రూ.0.62 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.0.25 కోట్లు, అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా 0.30 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 5.03 కోట్ల షేర్ ని రాబట్టింది.