telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

విడుదలైన మేజర్ ఫస్ట్ లుక్…

విభిన్నమైన కథలతో హీరో అడవి శేష్ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఎప్పటికప్పుడు కొత్త కథలతో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని అలరిస్తుంటాడు. అలాంటి అడవి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. అయితే నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో శేష్ ఎరినో షూట్ చేసేందుక గన్నును పట్టుకున్నట్లు ఉండి అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా కోసం శేష్ ఎంతగానో కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో ఉన్ని కృష్ణన్‌లా ఉండాలని అతడిని అర్థం చేసుకుంటూ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నిజ జీవితం ఆధారంగా రూపొందుతున్న విషయం తెలిసిన విషయమే. ఈ సినిమా కోసం కొన్ని సంవత్సారల పాటు శేష్ శ్రమించాడు. ఈ సినిమాలో సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్ కనిపించనున్నాడు. ఈ సినిమా మహేష బాబు బ్యానర్‌లో నిర్మితమవుతోంది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్‌ వారు అంతర్జాతీయంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా శశి కిరన్ దర్శకత్వంలో తెరకెక్కతోంది.

Related posts