telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ నటుడి పరిస్థితి విషమం

bengali-actor

ప్రముఖ బెంగాలీ నటుడు, దాదా సాహెబ్‌ ఫాల్కే విజేత సౌమిత్రా ఛటర్జీని(85) కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించారు. నిన్న ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కోవిడ్‌ పరీక్షలు చేయించాల్సిందిగా వైద్యులు సూచించారు. కోవిడ్‌ పరీక్షలు చేయించగా ఆయనకు పాజిటివ్‌ వచ్చినట్లు అక్టోబర్‌ 6న డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు కోల్‌కతాలోని బెల్లెవ్‌ నర్సింగ్‌ హోంకు తరలించారు. ఇటీవల కేంద్రం షూటింగ్‌లకు అనుమతివ్వడంతో ఆయన దర్శకత్తం వహిస్తున్న అభియాన్‌ షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కరోనా బారిన ఉంటారని కుటుంబ సభ్యులు అభిప్రాయ పడుతున్నారు. కాగా సౌమిత్రా ఛటర్జీ గొప్ప నటుడు. దర్శకదిగ్గజం సత్యజిత్‌ రేకి ఆయన చాలా ఆత్మీయుడు. సత్యజిత్‌ రే తెరకెక్కించిన దాదాపు అన్ని చిత్రాల్లో సౌమిత్రా ఛటర్జీ నటించారు. అయితే సౌమిత్రా ఆస్కార్‌ విజేతలైన సత్యజిత్‌ రే, ఫెలుడాల రచనలలో కూడా ఒక భాగంగా ఉన్నారు. వారి రచనలైన ది వరల్డ​ ఆఫ్‌ అపు, సంఘర్ష్‌లు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

Related posts