telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

19 ఏళ్ళ యువకుడిగా సూర్య… “ఆకాశమే నీ హద్దురా…” మేకింగ్ వీడియో

surya movie aaksame haddura first look

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘సూరరై పోట్రు’ తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ పేరుతో విడుదల కానుంది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకురాలు సుధ కొంగర. ఆస్కార్ అవార్డు గ్రహీత గునీత్ మోంగాతో పాటు సూర్య ఈ సినిమాను నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో విలక్షణ నటుడు మోహన్‌బాబు ముఖ్యపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రోమోస్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ వినోద్ మాల్యా అనే పాత్రలో నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ నడుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మేకింగ్ వీడియోను విడుదల చేశారు చిత్రబృందం. 4 నిమిషాల నిడివి గల వీడియోలో సూర్య ఎలాంటి బాడీ ట్రాన్సఫార్మేషన్ ను పొందాడో చూపించారు. ఈ చిత్రంలో సూర్య 19 ఏళ్ల యువకుడిగా కన్పించాల్సి ఉంటుంది. అయితే దర్శకురాలు ఈ విషయం చెప్పినప్పుడు సూర్య వెనకడుగు వేశారట. కానీ ఆ తరువాత సూర్య లుక్ చూసి షాకయ్యానంటూ దర్శకురాలు చెప్పుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. మీరు కూడా ఈ వీడియోను వీక్షించి చిత్ర యూనిట్ పంచుకున్న మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.

Related posts