telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

పారిశుద్ధ(సఫాయి) కార్మికులకు .. మోడీ 21 లక్షల విరాళం.. !

modi donated 21 laks to safaiwala

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా దిగ్విజయంగా ముగిసింది. అక్కడ సుమారు మూడు నెలల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించారు. కుంభమేళా దిగ్విజయంగా నిర్వహించడంలో పారిశుద్ధ(సఫాయి) కార్మికులు కీలక పాత్ర పోషించారు. ఆ కార్మికుల సేవలను గుర్తించిన ప్రధాని మోదీ.. సఫాయి కార్మికుల కార్పస్ ఫండ్‌కు 21 లక్షలు విరాళం ప్రకటించారు.

తన పర్సనల్ సేవింగ్ అకౌంట్ నుంచి ప్రధాని మోదీ ఆ మొత్తాన్ని కార్పస్ ఫండ్‌ను డొనేట్‌ చేశారు. కుంభమేళాను అద్భుతంగా నిర్వహించిన యూపీ ప్రభుత్వాన్ని కూడా మోదీ మెచ్చుకున్నారు. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో మేళా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కుంభమేళాతో మన సంస్కృతిని, ఆధ్మాత్మికతను ఘనంగా చాటారు అని మోదీ ఓ ట్వీట్ కూడా చేశారు.

 


మరోవైపు అజ్మీర్‌లో షరీఫ్ దర్గాలో ఉత్సవాలు జరుగుతున్నాయి. దర్గాలో 807వ ఉర్సును నిర్వహిస్తన్నారు. ఈ సందర్భంగా మోదీ సమర్పించిన చాదర్‌ను కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ దర్గాకు తీసుకువెళ్లారు.

Related posts