telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏసీ రూముల్లో పడుకుంటే.. అధికారంలోకి రాలేము

సొంత పార్టీ కాంగ్రెస్‌పై గులాం నబీ ఆజాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఓ జాతీయ మీడియాలో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మాట్లాడారు. కాంగ్రెస్‌లో మొదట్లో ఉన్న పరిస్థితులు లేవని.. నాయకుల్లో చాలా మార్పులు వస్తున్నాయన్నారు. పార్టీ టికెట్‌ రావడమే ఆలస్యం ఫైవ్‌ స్టార్‌ హెటల్స్‌లో ప్రత్యక్షమవుతున్నారని… ప్రజల్లో కంటే ఏసీ రూముల్లోనే ఎక్కువగా సమయంల వెచ్చిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి పోయే వరకు కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం కష్టమని.. ఈ తీరు వెంటనే మార్చుకోవాలని సూచించారు. గతంలో కర్ణాటక, ఏపీ, కేరళ రాష్ట్రాల్లో పార్టీ చాలా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు తాను బాధ్యుడిగా ఉంటూ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చానని గుర్తుచేశారు. 2004, 2009 లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమేనని.. 7 స్థానాలు ఉన్న పార్టీకి 35 స్థానాల వరకు రాబట్టడంతోనే అధికారంలోకి వచ్చామని తెలిపారు. ఆ తర్వాత పరిస్థితులు దారుణంగా మారిపోయాయని.. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రావాలంటే నేతలు ఏసీ రూములు వదిలి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు ఆజాద్‌. 

Related posts