సిక్కిం నూతన ముఖ్యమంత్రిగా ఎస్కేఎమ్ అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ ఈరోజు నేపాలీ భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ గంగా ప్రసాద్ ప్రేమ్ సింగ్ తమాంగ్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. పల్జోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎస్కేమ్ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కాగా, సిక్కిం శాసనసభలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఎస్కేఎమ్ పార్టీకి 17 స్థానాలు రాగా, ఎస్డీఎఫ్ పార్టీకి 15 స్థానాలు లభించాయి. కేవలం రెండు స్థానాలు దక్కించుకోకపోవడంతో ఎస్డీఎఫ్ పార్టీకి విజయావకాశాలు కోల్పోయాయి.
previous post
next post