telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ల్యాండింగ్ సమయంలో జారిన విమానం… అరచేతుల్లో ప్రయాణికుల ప్రాణాలు

Plane

నార్త్‌కరోలినా నుంచి చికాగో చేరుకుందా అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం. కాసేపట్లో విమానం చికాగోలో ల్యాండవుతుందని ప్రయాణికులంతా ఎదురుచూస్తున్నారు. కానీ విమానాశ్రయం వరకూ వచ్చిన ఆ విమానం ల్యాండవకుండా మళ్లీ గాల్లోకి లేచింది. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాని ప్రయాణికులు సిబ్బందిని ప్రశ్నించారు. ‘చికాగోలో వాతావరణ పరిస్థితులు బాగలేవు. అందుకే విమానం మరోసారి గాల్లోకి లేచింది. ఏం భయపడకండి ఇప్పుడే విమానం ల్యాండవుతుంది’ అని ప్రయాణికులకు సిబ్బంది ధైర్యం చెప్పారు. ఇంతలోనే ఆ విమానం మరోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించింది. రన్‌వేపై అలా దిగిందో లేదో.. ఆ విమానం జర్రున జారింది. రన్‌వేపై నుంచి పక్కకు దూసుకొచ్చి మంచులో దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో విమానం రెక్కలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విమానంలోని ప్రయాణికులకైతే పైప్రాణాలు పైనే పోయాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదని, ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నారని అమెరికన్ ఎయిర్‌లైన్స్ సంస్థ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

Related posts