telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

చెన్నమనేని కేసులో.. కేంద్రంపై తెలంగాణ హైకోర్టు సీరియస్…

high court on new building in telangana

వేములవాడ టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం కేసులో.. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు.. చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై ఎంబసీ నుండి పూర్తి వివరాలు తెలుసుకుని కౌంటర్ అఫిడవిట్ వేయాలని నవంబర్ 18న కేంద్ర హోం శాఖ ను ఆదేశించింది హైకోర్టు.. కానీ, కేంద్ర హోం శాఖ కేవలం మెమో మాత్రమే దాఖలు చేసింది. ఇక, మెమో దాఖలుపై కేంద్ర హోంశాఖ తీరుపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది.. కేవలం మెమో వేయడంపై కేంద్ర హోంశాఖ తీరును తప్పుబట్టిన హైకోర్టు.. ఎంబసీ నుండి పౌరుని వివరాలు రాబట్టలేక పోతే ఎందుకు మీ హోదా? అంటూ ప్రశ్నించింది. ఫిబ్రవరి 2020లో చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడు అని ఇచ్చిన మెమోనే మళ్ళీ ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. మరో మారు అవకాశం ఇస్తున్నాం.. జర్మన్ ఎంబసీ నుండి పూర్తి సమాచారం తీసుకుని అఫిడవిట్ వేయాలని కేంద్ర హోం శాఖను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. చూడాలి మరి ఈ కేసులో ఠిస్ర్పు ఎప్పటికి వెలువడుతుంది అనేది.

Related posts