telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ధరణిలో ఆస్తుల నమోదుపై ప్రభుత్వం కౌంటర్‌… హైకోర్టు విచారణ

high court on new building in telangana

ధరణిలో ఆస్తుల నమోదుపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. ధరణిలో ఆస్తుల రిజిస్టేషన్లను నిలిపేయాలని పిటిషన్ వేయగా..గత విచారణలో ధరణిలో ఆస్తులపై నమోదు తాత్కాలికంగా నిలిపేయాలని ఆదేశించింది హై కోర్టు. దీనిపై స్టే కొనసాగుతున్నది. అయితే.. ఆస్తుల నమోదు ప్రక్రియ పై కౌంటర్ దాఖలు చేసింది ప్రభుత్వం.ధరణి ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం చట్టాలను సవరించామని కౌంటర్ లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. ధరణిలో రాష్ట్రంలోని కోటీ ఆరు లక్షల ఆస్తుల నమోదు ప్రక్రియ జరుగుతోందని.. ధరణిలో కులం వివరాలు సేకరించబోమని హైకోర్టుకు తెలిపింది ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి సామాజిక వర్గం వివరాలు మాత్రమే సేకరిస్తామని..
సేకరించిన వివరాలన్నీ రాష్ట్ర డేటా సెంటర్ లో అత్యంత భద్రంగా ఉంటాయని పేర్కొంది ప్రభుత్వం. వ్యవసాయేతర ఆస్తుల యజమానుల ఆధార్ వివరాల కోసం ఒత్తిడి చేయబోమని తెలిపింది. ప్రభుత్వం వేసిన కౌంటర్ పై ఇవాళ వాదనలు కొనసాగునున్నాయి.

Related posts