telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎలా చస్తావో నీ ఇష్టం… నిందితుడికి కోర్ట్ ఆప్షన్

Crime

అమెరికాకు చెందిన లీ హాల్ (53) టెన్నెసీలో నివసించేవాడు. గుడ్డివాడైన లీ ఇక్కడే ఉండే ట్రేసీ కోజియర్‌తో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా అతన్ని ప్రేమించింది. కానీ కొన్ని రోజుల తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో వీరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇదిలా ఉండగా, ఓ రోజు వీరిద్దరూ గొడవపడుతుండగా కోపంతో ఊగిపోయిన లీ.. కారులో కూర్చొని ఉన్న ట్రేసీపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. అంతే పెద్దగా కేకలు వేస్తూ గిలగిల కొట్టుకొని ట్రేసీ దుర్మరణం పాలైంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు లీని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు ఫైల్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసులో అతనికి మరణశిక్ష పడుతుందని అందరూ భావించారు. 28 ఏళ్లపాటు కేసుపై విచారణ జరిపిన కోర్టు కూడా అదే నిర్ణయానికి వచ్చింది. 1976 తర్వాత అమెరికాలో మరణశిక్ష పడిన రెండో అంధుడు లీనే కావడం విశేషం. అయితే ఈ నేరం 1999 ముందు జరగడంతో అతని మరణశిక్షను ఎలా అమలు చేయాలో లీనే నిర్ణయించుకోవాలని కోర్టు ఆప్షన్ ఇచ్చింది. దాంతో అతను ఎలక్ట్రిక్ ఛైర్ పద్ధతిని ఎంచుకున్నాడు. తను చేసిన పని తప్పేనని, తన చావుతో కొందరికైనా మనశ్శాంతి చేకూరితే చాలని.. లీ తన చివరి క్షణాల్లో కోరుకున్నాడు.

Related posts