telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

చిరుతతో జింకపిల్ల యుద్ధం… వీడియో వైరల్

Buck

సౌత్ ఆఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్‌‌కు వెళ్లిన ఆండ్రూ ఫౌరీ అనే సఫారీ గైడ్‌కు అక్కడ విచిత్రమైన దృశ్యం కనిపించింది. న్యాలా అనే ఓ జంతువు పిల్ల పెద్ద చిరుతపులితో ఢీ కొట్టడం ఫౌరీ టీం చూసింది. వెంటనే తమ కెమెరాలకు పనిపెట్టి అక్కడి దృశ్యాన్ని రికార్డ్ చేయడం మొదలుపెట్టారు. పైనున్న వీడియోను గమనిస్తే.. న్యాలా పిల్ల చిరుతపులి నుంచి తప్పించుకోలేక యుద్దం చేయాలనుకుంది. అయితే అది కొట్టే దెబ్బలకు పులికి సైతం బోర్ కొట్టింది. న్యాలా పిల్లతో పోరాడటం కూడా దండగే అనుకుని.. ఆ జంతువు పిల్ల ఎన్ని దెబ్బలు కొడుతున్నా కిక్కురుమనకుండా పడుకుంది. ఆ పెద్ద జీవిని తాను ఏం చేయలేనని తెలిసి.. చివరకు ఆ న్యాలా పిల్ల కూడా పులి వెనుకే నడుచుకుంటూ వెళ్లడం చూస్తే జాలి కలుగుతుంది. చివరకు ఏం జరుగుతుంది? పులి ఆ న్యాలా పిల్లను ప్రాణాలతో వదిలిపెడుతుందా? అని తెలుసుకుందామని ఫౌరీ టీం దాదాపు రెండు గంటల సేపు ఆ దృశ్యాన్ని రికార్డింగ్ చేస్తూనే ఉన్నారు. ఆ ప్రాంతంలో చీకటి కూడా మొదలైంది కానీ.. ఆ రెండు జంతువుల మధ్య యుద్దం మాత్రం ముగియలేదు. వీడియోను చూస్తే.. చివరకు న్యాలా పిల్లను చిరుతపులి ఎలా పట్టుకుని తీసుకెళ్లిందో చూస్తే గుండె తరుక్కుపోతుంది. సహజంగా తాము వేటాడే దృశ్యాలను ఎక్కువగా చిత్రీకరించమని.. అయితే ఈ దృశ్యం తాము ఎన్నడూ చూడని విధంగా ఉండటంతో రికార్డ్ చేసినట్టు ఫౌరీ చెప్పాడు. అయితే ఈ వీడియో చూసిన కొందరు మాత్రం ఆ చిరుత జింకపిల్లను చంపకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నట్టుగా ఉందని అంటున్నారు.


Video Credits : Kruger Sightings

Related posts