బాధ్యతతో రక్తదానం చేయడానికి ముందుకు రావాలని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మారం మండలం నందిమేడారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం కొప్పుల మాట్లాడుతూ కరోనా సంక్షోభ సమయంలో ప్రజలు రక్తదానం చేయడం వల్ల తలసేమియా రోగుల ప్రాణాలను కాపాడినట్లు అవుతుందని అన్నారు.
క్లిష్టసమయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అద్భుతమని, ప్రజలు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తాన్ని దానం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఇతరుల ప్రాణాలను కాపాడటానికి రక్తదానం అలవాటుగా చేసుకోవాలని కోరారు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని చెప్పారు. రక్తదానం చేయాలని చాలా మందికి అవగాహన లేకపోవడంతో రక్తం దొరక్కపోవడంతో ఎంతో మంది చనిపోతున్నారని తెలిపారు. బ్లడ్ డొనేషన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.