కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా చర్యలను చేపడుతున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా షూటింగ్‌లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. పలువురు సెలబ్రిటీలు ప్రభుత్వాలకు విరాళాలను అందించడమే కాకుండా నైతికంగా తమ మద్దతుని తెలియజేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ‘తల’ అజిత్ కుమార్ కరోనాపై పోరుకి భారీ విరాళాన్ని ప్రకటించారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కోటి 25 లక్షల రూపాయలను విరాళంగా ప్రటించారు. ఇందులో రూ.50 లక్షలను ప్రధానిమంత్రి సహాయ నిధికి, రూ.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించారు. పాతిక లక్షలను దక్షిణాది సినీ కళాకారులకు (ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) విరాళంగా అందిస్తున్నట్లు తెలిపారు. విపత్కర పరిస్థితిలో సినీ కార్మికులను, కళాకారులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన అజిత్‌కు ‘FEFSI’ కృతజ్ఞతలు తెలిపింది. అజిత్ లాంటి స్టార్స్ భారీ విరాళాలు ప్రకటించి రియల్ హీరోస్ అనిపించుకుంటున్నారు.
previous post