telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మారని బ్రతుకులు..తీరని రుణాలు

migrate labour hyd

ప్రతి నిత్యం ఆకలిదప్పుల పోరాటంలో

అలసిన బ్రతుకులు మావి

గమ్యం తెలియని నడకలు మావి

తరాలు మారినా తలరాతలు

మారని జీవితాలు మావి..

 

జానెడంత పొట్ట చేత పట్టుకొని

బంధాల కోసం బానిసలుగా బ్రతకలేక

వాకిలి,వాడలు దాటి ఊరువదిలి

రైలెక్కి రాష్ట్రాలు తిరుగుతాం

కడుపు నింపే గుప్పెడు మెతుకుల కోసం..

 

అలుపెరుగని శ్రమచేస్తూ

పైసాపైసా పోగుచేసుకొని

చేసిన రుణాలకు వడ్డీలుకడుతూ

రూపాయ మిగిలితే ఆలుబిడ్డల కడుపునింపుతూ

కన్నీళ్ళను కష్టాలను దిగమింగుతూ

వెలుగురేఖలకై ఎదురుచూస్తూ..

 

సొంత ఊరికి వెళ్లగలమా

ఇంటి గడపను చూడగలమా

గ్రహణం పట్టిన ఈ జీవితాలకు

బ్రతుకు ఆశాకిరణం కనిపించేనా..

 

వలసకూలీలం మేము వలసకూలీలం

బాధ్యతల కోసం బంధాలని విడిచివెళ్లే వలస కూలీలం

ఎన్ని చేసినా మారని బ్రతుకులు మావి

ఎంత చేసిన తీరని రుణాలు మావి..!!

 

హామీ పత్రం: ఇది నా స్వీయ రచన..

అనువాదము చేయలేదు..

మరి ఎక్కడ ప్రచురింపబడలేదు..

ఇది నా హామీ….!!

 

 

Related posts