telugu navyamedia
రాజకీయ

సాహిత్యంలో ‘అబ్దుల్ ర‌జాక్ గుర్నా’ నోబెల్‌ బహుమతి

సాహిత్యంలో ఈ ఏడాదికి నోబెల్ అవార్డును గ‌ల్ఫ్ న‌వ‌లా ర‌చ‌యిత అబ్దుల్ ర‌జాక్ గుర్నా గెలుచుకున్నారు. . వలసవాదంపై ఆయన రాజీలేని పోరాటంతో పాటు, శరణార్థుల వ్యథను కళ్లకు కట్టినందుకుగానూ రజాక్‌కు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వెల్లడించింది.

అబ్దుల్‌ రజాక్‌ గుర్నా.. 1948లో హిందూ మహాసముద్రంలోని జాంజిబర్‌ ద్వీపంలో జన్మించారు. కానీ 1960 చివర్లో శరణార్థిగా ఇంగ్లాండ్‌ వలసవెళ్లారు. ప్రస్తుతం ఆయన కేంట్రబెరీలోని కెంట్‌ యూనివర్శిటీలో సాహిత్య ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇక 21వ ఏట నుంచే రచనలు ప్రారంభించారు రజాక్‌. ఇప్పటివరకు 10 నవలలు, ఎన్నో చిన్న కథలు రచించారు. 2005లో రజాక్‌ రాసిన ‘డిసర్షన్‌’ నవల అప్పట్లో సంచలనం సృష్టించింది.

Novelist Abdulrazak Gurnah Wins 2021 Nobel Prize in Literature - Sakshi

1994లో అబ్దుల్‌ర‌జాక్ ప్యార‌డైజ్ అనే న‌వ‌ల రాశారు. అది ఆయ‌న‌కు నాల్గ‌వ‌ది. ఆ న‌వ‌ల‌తో ఆయ‌న పాపుల‌ర్ రైట‌ర్‌గా మారారు. 1990లో ఈస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన ఆయ‌న ఆ న‌వ‌ల‌లో ఆ ట్రిప్ గురించి రాశారు. భిన్న‌మైన విశ్వాసం క‌లిగిన వ్య‌క్తుల ఓ విషాద ప్రేమ‌క‌థ‌ను చెప్పారు. శ‌ర‌ణార్థి అనుభ‌వాల‌ను త‌న న‌వ‌ల్లో గుర్నా అద్భుతంగా ఆవిష్క‌రించారు. ఐడెంటీ, సెల్ఫ్ ఇమేజ్‌పైనే ఆయ‌న త‌న క‌థ‌ల‌తో దృష్టి పెట్టారు. సంస్కృతులు, ఖండాల మ‌ధ్య ఉన్న తేడాల‌తో క్యారెక్ట‌ర్లు ఆస‌క్తిక‌రంగా మారుతాయి. అభ‌ద్ర‌తాభావంలో ఉన్న‌వారి జీవితాలు ఎలా ఉంటాయో ఆయ‌న త‌న ర‌చ‌నా శైలితో ప్ర‌స్పుటం చేశారు.

Related posts