telugu navyamedia
సినిమా వార్తలు

మెగాస్టార్ షాకింగ్ నిర్ణయం

chiranjeevi on maa schemes

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం “సైరా న‌ర‌సింహారెడ్డి”. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు వంటి టాప్ స్టార్స్ న‌టిస్తున్నారు. అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా చిత్రం విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. చిరంజీవి “సైరా న‌ర‌సింహారెడ్డి” ఫైన‌ల్ ర‌షెష్‌ను చూశార‌ట‌. అందులో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో చిరు డ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయి. అయితే తాను చేస్తున్నంది ఓ స్వాతంత్య్ర యోధుడి సినిమా కాబ‌ట్టి త‌న డ్యాన్సులు వ‌ద్ద‌ని డైరెక్ష‌న్ టీమ్‌కు సూచించార‌ట‌. కొన్ని చిన్న మార్పులు చేర్పులు కూడా చెప్పార‌ట‌. ఇప్పుడు డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి అండ్ టీమ్ ఆ మార్పులు, చేర్పులు చేస్తున్నార‌ట‌. ఇది మెగా అభిమానులకు చేదు వార్తే మరి.

Related posts