telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇర్ఫాన్‌ ఖాన్, రిషి కపూర్‌లు కలసి నటించిన ఏకైక చిత్రమిదే …

ఒకరోజు తేడాతో ఇద్దరు అసాధరణ నటులు ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. ఇర్ఫాన్‌ ఖాన్, రిషి కపూర్‌ల ఆకస్మిక మరణం కేవలం బాలీవుడ్‌నే కాదు యావత్ దేశాన్ని శోకంలో ముంచింది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు నటులు కలిసి ఒకే ఒక చిత్రంలో నటించారు. 2013లో నిఖిల్ అద్వానీ తెరకెక్కించిన ‘డీ-డే’ చిత్రంలో వీరిద్దరు కనిపించారు. ఈ మూవీలో రిషి కపూర్ డాన్ గా.. ఇర్ఫాన్ ఖాన్ రా ఏజెంట్ గా కనిపించారు. దీంతో ఆ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తోన్న నెటిజన్లు.. ఇద్దరు లెజండ్లను కోల్పోయాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఇద్దరు క్యాన్సర్‌ బారిన పడి దాదాపు రెండు సంవత్సరాల పాటు పోరాడి ఓడారు. ఇదిలా ఉంటే లాక్‌డౌన్ నేపథ్యంలో దేశం గర్వించదగ్గ గొప్ప నటులను సాధారణంగా పంపించడం వారి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సన్నిహితులు, తోటి నటీనటులు కూడా వారి చివరి చూపును చూడలేకపోయారు.

Related posts