ఏపీ ఎన్నికల సమయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఎన్ని కామెంట్స్ చేశారో తెలిసిందే. మొదటి నుండి మెగాఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉండే వర్మ.. తాజాగా మరోసారి పవన్ పై విరుచుకుపడ్డారు. అంటూ పవన్ గతంలో అన్న మాటలను ప్రస్తావిస్తూ ఈ మాటలు అన్నది ఎవరు..? అంటూ ప్రశ్నించారు. ఇది చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.
”జగన్ నువ్వేలా సీఎం అవుతావో చూస్తా..
జగన్ నీకు మగతనం ఉందా..?
జగన్ నువ్వు అసలు రెడ్డివేనా..?
జగన్ అసెంబ్లీ నుంచి పారిపోయాడు..
జగన్ చిన్న కోడికత్తికే గింజుకున్నాడు..
తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు..
రాయలసీమ రౌడీలను గోదాట్లో కలిపేస్తా..
బెజవాడ గుండాల తోలు తీస్తా..
నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఆపేదెవడు?
పాకిస్థాన్‌తో యుద్దం వస్తుందని నాకు ముందే తెలుసు..
థియేటర్‌లో జాతీయగీతం పాడితేనే దేశభక్తి ఉన్నట్లా..?
హిందువులపై మస్లింల దాడులు సహించను..
ముస్లిమ్స్ దేశభక్తి నిరూపించుకోవాలా..?
ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా..
జగన్ అవిశ్వాసం పెడితే దేశం మొత్తం తిరిగి 50 మంది ఎంపీల మద్దతు కూడగడతా..
2 లక్షల పుస్తకాలు చదివా..
32 మార్కులతో 10 పాసయ్యా..
మా అన్నయ్య కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోతే సాక్షిలో నీచంగా రాశారు
(ఆమె వెళ్లిపోయింది 2007లో.. సాక్షి పేపర్ స్థాపించింది 2008 మార్చిలో)”