telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎవరు ఎవరికి లైఫ్ ఇచ్చారు బాస్… బండ్ల గణేష్ కు హరీష్ శంకర్ కౌంటర్

Harish-Shankar

“గబ్బర్ సింగ్” సినిమా విడుదలై మే 11తో 8 ఏళ్లు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్ర దర్శక, నిర్మాతల మధ్య వివాదం రాజుకుంది. “గబ్బర్ సింగ్” ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర దర్శకుడు హరీష్ శంకర్.. నిర్మాత బండ్లను వదిలేసి మిగిలిన అందర్నీ గుర్తు చేసుకుని ట్వీట్ చేయడంతో బండ్ల గణేష్ ఫీల్ అయ్యారు. దీంతో హరీష్ శంకర్‌ను ఓ రేంజ్‌లో ఏకిపారేశారు. దీంతో ఎవరు ఎవరికి లైఫ్ ఇచ్చారు బాస్ అంటూ బండ్ల గణేష్‌కి గట్టి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు హరీష్. “బై మిస్టేక్ అలా బండ్ల గణేష్ పేరు మరిచిపోయా కాని.. కావాలని కాదు.. సరేకాని ఆయన నాకు లైఫ్ ఇచ్చాడా.. ఆంజనేయులు, తీన్ మార్ సినిమాల ఫ్లాప్ లతో రోడ్డుపై పడితే నేను ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఆయనకు లైఫ్ ఇచ్చా అని చెప్పొచ్చు.. కాని నేను చెప్పను. ఎందుకంటే నాకు సంస్కారం ఉంది కాబట్టి. అయితే ఈయన ఏమైనా దిల్ రాజునా? లేక అరవింద్‌నా? మైత్రీ మూవీ మేకర్స్ అనుకుంటున్నారా? ఆయన క్రెడిబులిటీ ఏంటి? ఎవరు ఎవర్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు? ఎవరు ఎక్కడికి వెళ్లారు అన్నది అందరికీ తెలుసు? ఇలాంటి క్రెడిబిలిటీ లేని వ్యక్తుల గురించి మాట్లాడటం వేస్ట్.. అయినా చిన్న లాజిక్ బాస్… నేను డైరెక్ట్ చేసిన ‘షాక్’ సినిమా 2006లో విడుదలైంది. ఆయన ‘ఆంజనేయులు’ 2009లో వచ్చింది. ఈ లెక్కన ఈయన నాకు లైఫ్ ఇవ్వడం ఏంటి? ఎవరు ఎవరికి లైఫ్ ఇచ్చినట్టు? అంటూ ఫైర్ అయ్యారు హరీష్ శంకర్. మరి దీనికి బండ్ల గణేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related posts