telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

తలనొప్పా .. తక్షణ ఉపశమనం… ఇలా.. !

tips to over come headache immediately

రోజు ఒత్తిడితో కూడిన జీవనంతో తలనొప్పి అనేది తరచూ పలకరించే సమస్య. అయితే అది వస్తే, ఏ పని చేసుకోలేము కాబట్టి, తక్షణం తగ్గించుకునే ఉపాయం కోసం వెతుకుతాం. సాధారణంగా మ‌న‌కు క‌లిగే అనేక స్వ‌ల్ప అనారోగ్య స‌మ‌స్య‌ల్లో త‌ల‌నొప్పి కూడా ఒక‌టి. మ‌నకు ఎక్కువ‌గా ప‌నిచేసి అల‌సిపోయినా, డిప్రెష‌న్‌, మాన‌సిక ఆందోళ‌న‌, ఒత్తిడితో బాధ‌ప‌డుతున్నా.. లేదా మ‌రే ఇత‌ర కార‌ణాల వల్ల అయినా మ‌న‌కు త‌ల‌నొప్పి రెగ్యుల‌ర్‌గా వ‌స్తూనే ఉంటుంది.

త‌ల‌నొప్పిని త‌గ్గించుకునేందుకు మ‌నం ఎక్క‌డికో వెళ్లాల్సిన పనిలేదు. సైడ్ ఎఫెక్ట్స్ క‌లిగింగే ఇంగ్లిష్ మందుల‌ను మింగాల్సిన ప‌నికూడా లేదు. సింపుల్‌గా ద్రాక్ష ర‌సం తాగేయండి. దెబ్బ‌కు త‌ల‌నొప్పి త‌గ్గుతుంది.

tips to over come headache immediatelyఒక గ్లాస్ ద్రాక్ష ర‌సం తాగితే బాగా త‌ల‌నొప్పిగా ఉన్నా కూడా వెంట‌నే త‌గ్గుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ద్రాక్ష పండ్ల‌లో ఉండే రైబోఫ్లేవిన్‌, విట‌మిన్ బి12, సి, కె, మెగ్నిషియంలు త‌ల‌నొప్పిని త‌గ్గిస్తాయి.

మైగ్రేన్ వంటి దీర్ఘ‌కాలిక త‌ల‌నొప్పి స‌మ‌స్య‌కు కూడా ద్రాక్ష ర‌సం మెరుగ్గా ప‌నిచేస్తుంద‌ని వైద్యులు సూచిస్తున్నారు. ద్రాక్ష ర‌సాన్ని వారు రోజూ తాగితే మైగ్రేన్ నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని వైద్యులు చెబుతున్నారు..!

Related posts