telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా”పై రాఘవేంద్ర రావు, నాని ట్వీట్లు

Syeraa

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి” వెండితెరపై ప్రేక్షకులను మెప్పిస్తోంది. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమితాబ్‌, కిచ్చా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “సైరా” చిత్రాన్ని దేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తూ సినిమాను విజయవంతం చేశారు. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నేచురల్ స్టార్ నాని ట్విటర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. “సైరా” అద్భుతంగా ఉందని, చిరంజీవి కఠోర శ్రమ ప్రతీ సన్నివేశంలోనూ కనిపించిందని రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు. “చిరంజీవి నాకు ఎన్నో దశాబ్దాలుగా తెలుసు. ఇన్నేళ్లు గడుస్తున్నా ఆయనలో అంకితభావం, సినిమా పట్ల ఉన్న ఆసక్తి కొంచెం కూడా తగ్గకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిగా ఆయన ప్రతీ విషయంలోనూ అద్భుతంగా కనిపించారు. తన వయసుకి చిరంజీవి ఇలాంటి సినిమాలో నటించడం నిజంగా గొప్ప విషయం. ఇంతటి భారీ సినిమాను రూపొందించిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి కృషి స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన డైరెక్షన్ అద్భుతం. ఇక, ప్రీ-క్లైమాక్స్ డ్యాన్స్ సీక్వెన్స్‌లో తమన్నా నటన అద్భుతం. బ్లాక్‌బస్టర్ సాధించిన `సైరా` యూనిట్ మొత్తానికి అభినందనలు. తండ్రికి రామ్‌చరణ్ ఇచ్చిన ఉత్తమ బహుమతి ఈ చిత్రం” అని రాఘవేంద్రరావు వరుస ట్వీట్లు చేశారు.

నేచురల్ స్టార్ నాని కూడా “సైరా” గురించి ట్వీట్ చేశాడు. “నేను ప్రస్తుతం దక్షిణ కొరియాలో ఉండడంతో `సైరా` చూడలేకపోయాను. కానీ, టాక్ వినపడింది.. భారత్‌లో బాక్సాఫీస్ ఘరానామొగుడు వచ్చాడని. వెయిట్ చేయలేకపోతున్నా. ఇక్కణ్నుంచే చిరంజీవిగారికి పెద్ద హగ్ ఇస్తున్నాను” అని నాని ట్వీట్ చేశాడు.

Related posts